ITI JOBs 2022 | హైదరాబాద్ లోని ECIL 284 ఖాళీల భర్తీకి ప్రకటన.. | వీరు మాత్రమే అర్హులు..
తెలంగాణ, హైదరాబాదులోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) భారత ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కలిగిన ఎంటర్ప్రైజెస్ సంస్థ, ఏదైనా విభాగంలో ఐటిఐ సర్టిఫికెట్ నేషనల్ కౌన్సిల్ ఫర్ వోకేషనల్ ట్రైనింగ్ (NCVT) సంస్థ నుండి కలిగిన అభ్యర్థులకు అప్రెంటిస్షిప్ అవకాశాలను కల్పించడానికి మొత్తం 16 విభాగాల నుండి, ఎలాంటి రాతపరీక్ష లేకుండా.. ఖాళీలను భర్తీకి ప్రకటిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు స్వయంగా దరఖాస్తులను ఈనెల 12వ తేదీ న ఉదయం 10:00 నుండి నిర్వహిస్తున్న డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ లో పాల్గొని సీటు సంపాదించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, స్కాలర్షిప్.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 284,
విభాగాలు:
ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, టర్నర్, మెకానిక్, కార్పెంటర్, కోపా, డీజిల్ మెకానిక్, ప్లంబర్, వెల్డర్, పెయింటర్.. మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా సంస్థ నుండి ఐటిఐ సర్టిఫికెట్ కలిగి, అనగా; నేషనల్ కౌన్సిల్ ఒకేషనల్ ట్రైనింగ్ (NCVT) సంబంధిత ట్రేడ్ నుండి కలిగి ఉండాలి.
వయోపరిమితి:
అక్టోబర్ 14 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ఓబీసీలకు 28 మరియు ఎస్సీ ఎస్టీలకు 30 సంవత్సరాలు వరకు వర్తిస్తుంది.
ఎంపిక విధానం:
అభ్యర్థులు అకడమిక్ టెక్నికల్ విద్యార్హత లో మరియు సంబంధిత ట్రేడ్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అభ్యర్థులు అధికారిక స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎంటర్ప్రెన్యూర్షిప్ (MSDE) వెబ్ సైట్ https://www.apprenticeshipindia.gov.in/ ను సందర్శించి అనగా; అధికారిక అప్రెంటిస్షిప్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకుని నోటిఫికేషన్లో పేర్కొన్న తేదీ రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకుని సీటు పొందవచ్చు..
అప్రెంటిస్షిప్ పోర్టల్ నందు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సంబంధిత ప్రింట్ తో, నోటిఫికేషన్లో పేర్కొన్న టువంటి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఐటిఐ అప్రెంటిస్ సెలక్షన్-2022 దరఖాస్తు ఫామ్ పాస్ పోర్ట్ సైజు ఫోటో తో పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి.
ఈ ప్రవేశాలకు తెలంగాణ అభ్యర్థులు మాత్రమే అర్హులు.
రిజిస్ట్రేషన్ కోసం అప్రెంటిస్షిప్ పోర్టల్ ఎప్పుడు తెరిచి ఉంటుంది గమనించండి.
ప్రవేశం కోసం వచ్చేనెల 12వ తేదీ (12.09.2022) నా సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరు కాగలరు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం హాజరవడానికి చిరునామా:
Govt.QQS ITI-Girls, Santhoshnagar, Saidabad (Mandal), Hyderabad.







ఫలితాలు ప్రకటించిన తేదీ : 20.09.2022.
అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ప్రారంభమవు తేదీ: 18.10.2022.
అదికారిక వెబ్ సైట్ :: https://www.ecil.co.in/
అదికారిక నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment