UPSC NDA & NA Exam 2022 | ఇంటర్ తో 400 కేంద్ర ప్రభుత్వ కొలువులు | సెకండియర్ చదువుతున్నవారు కూడా అర్హులే..
UPSC NDA & NA 2 Examination 2022: యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) & నెవల్ అకాడమీ (NA) అవివాహిత మహిళ పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు ఈ నెల 18వ తేదీ నుండి.. జూన్ 7వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలైన ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, దరఖాస్తును ఫీజు, ఎంపిక విధానం, రాతపరీక్ష సెంటర్ల వివరాలు, పూర్తి వివరాలు మీకోసం.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 400 విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ◆ నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) - 370, ● ఆర్మీ - 208, ● నేవీ - 42, ● ఎయిర్ పోర్ట్ - 120.. ◆ నేవెల్ అకాడమీ (10+2 క్యాడేట్ ఎంట్రీ స్కీం) - 30.. UPSC NDA & NA 2 Examination 2022 అర్హత ప్రమాణాలు: విద్యార్హత: ● ఆర్మీ వింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్(10+2) లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ● ఎయిర్ పోర్ట్, నేవల్ వింగ్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్...