ఉపాధ్యాయుల నియామకాలకు దరఖాస్తులు షురూ.. TS DSC 2023 for 5089 Posts Onlin Apply Started..
ఉపాధ్యాయుల నియామక ప్రకటన 2023: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టర్ పాఠశాల విద్యాశాఖ తెలంగాణ హైదరాబాద్. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లా ఎంపిక కమిటీ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్స్, లాంగ్వేజ్ పండిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ మొదలగు విభాగాల్లోని 5089 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో ఉపాధ్యాయ శిక్షణ అర్హతలు (డి.ఎడ్/ బీ.ఎడ్/ బీ.పీ.ఎడ్) కలిగి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 20.09.2023 నుండి 21.10.2023 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. పూర్తి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సోపానాలు దిగువ సూచించడం జరిగింది. ఆసక్తి కలిగిన వారు పూర్తిగా చదవండి. దరఖాస్తులు సమర్పించండి. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 5089 . విభగలవారీగా ఖాళీల వివరాలు : సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) - 2575, స్కూల్ అసిస్టెంట్ (SA) - 1739, లాంగ్వేజ్ పండిట్ (LP) - 611, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET) - 164. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొ...






























%20Posts%20here.jpg)

