Income Tax india 2.0 Portal full information | e-Filing చేసుకొనుటకు సూచనలు వివరంగా ఇక్కడ చదవండి..

E-Filing చేసుకొనుటకు సూచనలు: ఇన్కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ కోసం జూన్ 7 నుంచి ప్రారంభమైన కొత్త సైట్ ఇప్పటివరకు అవాంతరాలతో నడిచింది. ప్రస్తుతం బాగానే పనిచేస్తుంది. వాస్తవానికి మనం ఈ ఫైలింగ్ ప్రతీ సంవత్సరం జులై 31 లోగా సబ్మిట్ చేయాల్సి నప్పటికీ ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఈ గడువు సెప్టెంబర్ 31 వరకు పెంచడం జరిగింది. గత రెండున్నర నెలలగా కొత్తసైట్ సరిగా పని చేయనందున ప్రస్తుతం ఈ గడువు చాలదని డిసెంబర్ 31 వరకు పెంచాలని చాలామంది కోరుతున్నారు. ఇన్కమ్ టాక్స్ రిటర్న్ (ఈ - ఫైలింగ్) అనేది ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చేయాల్సిందే. 2,50,000 పైబడిఆదాయం కలిగిన వారందరూ ఇన్కమ్ టాక్స్ పడనప్పటికీ తప్పనిసరిగా ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 75 సంవత్సరాల సూపర్ సీనియర్ సిటిజన్స్ వారి ఆదాయం 5 లక్షల లోపు అయితే ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయడం నుండి మిన హాయింప బడ్డారు. కారణం ఏదైనా ఎవరేని ఈ-ఫైలింగ్ చేయని వారికి రెండు మూడు సంవత్సరాల తరువాత కూడా నోటీసులు రావడం గమనించుకోవలసిన విషయం. కొత్తగా ప్రారంభమైన ఇన్కమ్ టాక్స్...