స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | AP GGH Staff Nurse Recruitment 2023 | Apply here..

ఇంటర్మీడియట్ తో డిప్లమా ఇన్ జనరల్ నర్సింగ్ మరియ మిడ్ వైఫరీ (లేదా) జిఎన్ఎం/ బి.ఎస్సి(నర్సింగ్)/ ఎంఎస్సి (నర్సింగ్) అర్హతలతో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కాకినాడలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(GGH) శుభవార్త చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ధ్రువపత్రాల పరిశీలన ద్వారా నియమకాలు చేపడుతున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో ప్రకటిస్తూ తాజాగా ధరఖాస్తు ఫామ్ ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం అందుబాటులోకి తెచ్చింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు కాకినాడ GGH కార్యాలయంలో నిర్దిష్ట కౌంటర్లలో ఆఫ్లైన్ దరఖాస్తులను నేరుగా 30-06-2023 సాయంత్రం 5:00 లోపు లేదా అంతకంటే ముందే సమర్పించాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య - 97. పోస్టుల వివరాలు : స్టాఫ్ నర్స్ (GNM (నర్సింగ్)) - 43, స్టాఫ్ నర్స్ (బి.ఎస్సి (నర్సింగ్)) - 28, స్టాఫ్ నర్స్ (ఎం.ఎస్సి (నర్సింగ్)) - 26. వర్గాల వారీగా రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలు కోసం అధికారిక నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేయడానికి ముందు పూర్తిగా చదవండి వ...