డిగ్రీ చదువుతున్న వారికి రూ.2లక్షలు స్కాలర్షిప్ Reliance Foundation Scholarship 2023-24 for Graduates Apply here..

ఏదైనా విభాగంలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను అభ్యర్థులకు శుభవార్త! రిలయన్స్ ఫౌండేషన్ వారు డిగ్రీ కోర్స్ పూర్తయ్యేంత వరకు ఆర్థిక ప్రోత్సాహం క్రింద ఎంపికైన ప్రతిభావంతులైన విద్యార్థులకు 2లక్షలు స్కాలర్షిప్ అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. విద్యా సంవత్సరం 2023-24 కు గాను 5000 మందికి ఈ అవకాశాలు. అకడమిక్ ప్రతిభ/ వ్యక్తిగత సమాచారం ఆధారంగా అర్హులను ఎంపికలు చేస్తారు. చివరిలో రాత పరీక్ష ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. దీని ప్రకారం తుది ఎంపిక ఉంటుంది. రిలయన్స్ ఫౌండేషన్ ఉన్నత విద్య అభ్యసించడంలో ఇబ్బందులకు గురవుతున్న మరియు ఆర్థికంగా వెనుకబడి ఉన్న విద్యార్థులకు తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రతిభావంతులను వెలికి తీసి ఈ స్కాలర్షిప్ ను అందిస్తోంది. రాబోయే 10 సంవత్సరాలలో 50,000 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ చేయుతనందించడానికి ఈ పథకాన్ని 2022లో ప్రారంభించింది. ఇందులో భాగంగా గడిచిన విద్యా సంవత్సరం 2022-23 లో 5000 మందికి అవకాశాలను అందించింది. ఈ విద్యా సంవత్సరం 2023-24 కు గాను 5000 మందికి ఈ అవకాశాలను అందించడానికి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలుపుతూ అధికారికంగా నోటిఫికేషన్ జ...