Power Grid Recruitment 2022 | పవర్ గ్రిడ్ ఫీల్డ్ ఇంజనీర్ & ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ప్రకటన | పూర్తి వివరాలివే..

పవర్ గ్రిడ్ ఉద్యోగ నియామకాలు - 2022 : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, 2 సంవత్సరాల ఒప్పంద ప్రాతిపదికన, ఫీల్డ్ ఇంజనీర్ మరియు ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి, ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిప్లమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు జూన్ 1, 2022 వరకు దరఖాస్తులు చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం. Indian Post Payment Bank | IPPB - Recruitment 2022 | Graduate Can Apply 650 Vacancies | Check Selection Criteria here.. భారత ప్రభుత్వానికి చెందిన, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ప్రధాన కార్యాలయం భారతదేశంలోని గురుగ్రామ్ లో ఉంది. భారతదేశం అంతటా విద్యుత్ ను ప్రసారం చేయడానికి పవర్ గ్రిడ్ కీలక పాత్ర పోషిస్తుంది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 75, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ◆ ఫీల్డ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) - 25, ◆ ఫీల్డ్ ఇంజనీర్(సివిల్) - 10, ◆ ఫీల్డ్ సూపర్వైజర్(ఎలక్ట్రికల్) - 30, ◆ ఫీల్డ్ సూపర్వైజర్(సివిల్) - 10...