AMD Recruitment 2022 | 10తో 321 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చేయండిలా..

నిరుద్యోగులకు శుభవార్త! 10వ తరగతి, డిగ్రీ అర్హతతో.. భారత ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రేషన్) శాశ్వత ప్రాతిపదికన ఈ క్రింద పేర్కొన్నటువంటి ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది, అర్హత ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ మహిళ, పురుష & మాజీ-సైనికులు ఆన్లైన్ దరఖాస్తులను అక్టోబర్ 29, 2022 నుండి నవంబర్ 17, 2022 మధ్య సమర్పించవచ్చు.. రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు జరగనున్న ఈ ఉద్యోగ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు మీకోసం.. తప్పక చదవండి :: 10వ తరగతితో స్థానిక భాష పై పట్టు ఉన్న భారతీయ యువతకు ఇంటెలిజెన్స్ బ్యూరో భారీగా ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి, 1671 శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 321. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ◆ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్(JTO) - 09, ◆ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్-'ఏ' - 38, ◆ సెక్యూరిటీ గార్డ్ - 274.....