AMD Recruitment 2022 | 10తో 321 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చేయండిలా..
నిరుద్యోగులకు శుభవార్త!
10వ తరగతి, డిగ్రీ అర్హతతో.. భారత ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రేషన్) శాశ్వత ప్రాతిపదికన ఈ క్రింద పేర్కొన్నటువంటి ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది, అర్హత ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ మహిళ, పురుష & మాజీ-సైనికులు ఆన్లైన్ దరఖాస్తులను అక్టోబర్ 29, 2022 నుండి నవంబర్ 17, 2022 మధ్య సమర్పించవచ్చు.. రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు జరగనున్న ఈ ఉద్యోగ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు మీకోసం..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 321.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్(JTO) - 09,
◆ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్-'ఏ' - 38,
◆ సెక్యూరిటీ గార్డ్ - 274..
తప్పక చదవండి :: ITBP HC Recruitment 2022 | 10+2 తో 293 ప్రభుత్వ కొలువుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేయండిలా..
విద్యార్హత:
◆ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్లకు :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంగ్లీష్/ హిందీ ప్రధాన సబ్జెక్టుగా మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
◆ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్-'ఏ' :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
◆ సెక్యూరిటీ గార్డ్ లకు :
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి/ తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
తప్పక చదవండి :: NVS Hyderabad Region Recruitment 2022 | హైదరాబాద్ రీజియన్ నవోదయ విద్యాలయ సమితి రాతపరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
◆ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఆ వివరాలు;
● అండ్ రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ లకు 35 సంవత్సరాలు,
● ఎస్సీ/ ఎస్టి లకు 40 సంవత్సరాలు,
● ఓబీసీలకు 38 సంవత్సరాలు.
ఎంపిక విధానం:
◆ రాత పరీక్ష ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
తప్పక చదవండి :: 10+2 తో 293 ప్రభుత్వ కొలువుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేయండిలా..
పరీక్ష సెంటర్ల వివరాలు:
దేశవ్యాప్తంగా మొత్తం 16 నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
◆ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు హైదరాబాద్, విశాఖపట్నం లను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేయవచ్చు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.18,000/- నుండి రూ.35,400/- వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.







ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 29.10.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 17.11.2022.
అధికారిక వెబ్సైట్ :: https://www.amd.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
నిరాకరణ : మేము eLearningBADI.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment