NCSC Hyderabad JOB Fair 2022 | హైదరాబాద్ వేదికగా 200 ఉద్యోగాల భర్తీకి రేపే ఇంటర్వ్యూ.. రిజిస్టర్ అవ్వండిలా..

నిరుద్యోగులకు శుభవార్త! ఎలాంటి అనుభవం లేకుండా.. 10వ, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు నేషనల్ కెరియర్ సర్వీస్ సెంటర్(NCSC) ఉద్యోగాల భర్తీకి రేపు 24.11.2022 ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 03:00 గంటల వరకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు, అధికారిక నేషనల్ కెరియర్ సర్వీస్(NCS) పోర్టల్ ద్వారా అభ్యర్థులకు ప్రకటనను విడుదల చేస్తూ, రిజిస్ట్రేషన్ లింకును అందుబాటులో ఉంచింది . ఈ ఉద్యోగ డ్రైవ్ లో నిరుద్యోగ యువత పాల్గొని ఉద్యోగాలను సొంతం చేసుకోవడానికి ఈనెల 17వ తేదీ నుండి ఈరోజు రాత్రి 12:00 గంటల వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.. రిజిస్ట్రేషన్ పూర్తి విధానం ఇక్కడ. తప్పక చదవండి :: తెలంగాణ, వికలాంగుల & వయోవృద్ధుల సంక్షేమ శాఖ, హైదరాబాద్ హెల్ప్ డెస్క్ కోఆర్డినేటర్, డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ఖాళీల వివరాలు: 200. పాల్గొంటున్న కంపెనీల సంఖ్య : 02. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి. నిర్వహిస్తున్న సంస్థ : నేషనల్ కెరియర్, హ...