తెలంగాణ ఆర్టీసీలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. పదో తరగతి ఐటిఐ అర్హత కలిగిన 33 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

పదో తరగతి ఐటిఐ అర్హత తో RTC లో 1743 ఉద్యోగాలు భర్తీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త! ప్రకటించింది. పదో తరగతి ఇంటర్మీడియట్ అర్హతతో ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 1743 శాశ్వత డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Rc No.279/ Rect. / Rect.1/ 2025 తేదీ: 17 సెప్టెంబర్ 2025 న విడుదల చేసింది. ఈ నియామకాలు తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహిస్తోంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం RTC లో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అకాడమిక్ అర్హతలు స్కిల్ టెస్ట్ ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నది. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులో భాగంగా అర్హత ద్రోపత్రాల కాపీలను సైతం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది గమనించండి. అకాడమిక్ అర్హతలకు వెయిటేజ్ కల్పిస్తారు, కాబట్టి అర్హత ధ్రువ పత్రాల కాపీలు లో స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. జిల...