Teacher Job Alert 2022 | అటవీ కళాశాలలో ఉపాధ్యాయుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ వివరాలివవే..
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్రం విభజన తరువాత కాలం నుండి రాష్ట్రలోని నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అనేక నోటిఫికేషన్ లను విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా అటవీ కళాశాల నుంచి పలు ఉపాద్యాయుల భర్తీ కి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నుండి ప్రత్యేక ప్రకటనను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో వున్న ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వివిధ విభాగాలలో 27 ప్రోపెసర్, అసోసియేట్ ప్రోపెసర్, అసిస్టెంట్ ప్రోపెసర్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభర్దులకు 01-07-2022 నాటికి 21 సంవత్సరాల నుంచి 61సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. దరఖాస్తు స్వీకరణ ఆన్ లైన్ ప్రక్రియలో వుంటుంది. దరఖాస్తు స్వీకరణ 06సెప్టెంబర్ 2022 నాటి నుంచి మొదలై 27 సెప్టెంబర్ 2022 నాటికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగుస్తుంది. ఆసక్తి కలిగిన తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చును. నోటిఫికేషన్ యొక్క ముఖ్య వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం...
* పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీగా వున్న పోస్టుల సంఖ్య: 27పోస్టులు
* విభాగాల వారీగా ఖాళీలు:
ప్రొఫెసర్: 02పోస్టులు
అసోసియేట్ ప్రోఫెసర్: 04పోస్టులు
అసిస్టెంట్ ప్రోఫెసర్: 21పోస్టులు
* విద్యార్హతలు:
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాలలో ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంటెక్, ఎంవీఎస్సీ, పీహెచ్ డీ ఉత్తీర్ణత పాటు బోధన, పరిశోధన అనుభవం కలిగిన వారై వుండాలి.
* వయో పరిమితి:
01/07/2022నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకొని 61 సంవత్సరాల మధ్య వయసు వుండాలి. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందుగా నోటిఫికేషన్ చదవండి.
* దరఖాస్తు విధానం:
దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించాలి.
* దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేసుకునే అభర్దులు 500రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
* ఎంపిక విధానం:
అకడమిక్ స్కోర్, అకడమిక్ / రీసెర్చ్ యాక్టీవిటీ, బోధన అనుభవం, రీసెర్చ్ పబ్లికేషన్స్, ఇంటర్వ్యూ కమ్ డెమో తదితరల ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తు ప్రారంభ తేదీ:
06 సెప్టెంబర్ 2022 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలవుతుంది.
* దరఖాస్తు చివరి తేదీ:
27 సెప్టెంబర్ 2022 నాడు దరఖాస్తు స్వీకరణ చివరి ముగుస్తుంది.
* వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.57,700/- నుండి రూ.1,44,200/- వరకు ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 06.09.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 27.09.2022.







అధికారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్ :: త్వరలో అప్ డేట్ చేయబడుతుంది.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment