ITBPF - 186 Constable permanent Vacancies Recruitment 2022 | 10+ITI తో 186 ప్రభుత్వ పర్మినెంట్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండిలా..
నిరుద్యోగులకు శుభవార్త!
తప్పక చదవండి :: ఇంటర్ తో CRPF నుండి రాత పరీక్ష లేకుండా! 322 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైనది. వివరాలివే.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ITBPF) గ్రూప్-సి నాన్ గేజిటెడ్ (నాన్-మినిస్టీరియల్) పే స్కేల్ లెవెల్ రూ.21,700/- నుండి రూ.81,100/- వరకు గల ప్రభుత్వ పర్మినెంట్ 186 కానిస్టేబుల్ ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ మహిళ, పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు అక్టోబర్ 29, 2022 నుండి నవంబర్ 27, 2022 దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం ముఖ్య తేదీల వివరాలు మీకోసం..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 186.
విభాగాల వారీగా ఖాళీలు:
◆ హెడ్ కానిస్టేబుల్ (మోటర్ మెకానిక్) - 58,
◆ కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్) - 128.
తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో CISF 787 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల..
విద్యార్హత:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 10వ తరగతి అర్హత కలిగి ఉండాలి.
◆ గుర్తింపు పొందిన ఒకేషనల్ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో ఒక(1) సంవత్సరం సర్టిఫికెట్ కోర్స్/ ఒక(1) సంవత్సరం పారిశ్రామిక అనుభవం.
◆ అలాగే సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల అనుభవం.
◆ మూడు సంవత్సరాల ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిప్లమా అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
◆ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 28.11.2022 & 27.11.2004 మధ్య జన్మించి ఉండాలి.
◆ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక లు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST), రాత పరీక్ష/ మెడికల్ ఎగ్జామినేషన్/ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ మొదలగు పరీక్షల ద్వారా తుది ఎంపిక చేస్తారు.
తప్పక చదవండి :: ఇంటర్ తో 40 ప్రభుత్వ పర్మినెంట్ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండిలా..
గౌరవ వేతనం:
◆ కానిస్టేబుల్ (మోటర్ మెకానిక్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు (7th CPC), ఫేస్ స్కేల్ లెవెల్-3, బేసిక్ పే రూ.21,700/- నుండి రూ.69,100/- వరకు..
◆ హెడ్ కానిస్టేబుల్ (మోటర్ మెకానిక్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు (7th CPC), ఫేస్ స్కేల్ లెవెల్-4, బేసిక్ పే రూ.25,500/- నుండి రూ.81,100/- వరకు అన్ని అలవెన్స్ లతో కలిపి ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
◆ ఎంపికైన అభ్యర్థులు భారతదేశ బోర్డర్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.







ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 29.10.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 27.11.2022.
అధికారిక వెబ్సైట్ :: https://www.itbpolice.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
తప్పక చదవండి :: 10తో 287 ప్రభుత్వ పర్మినెంట్ కానిస్టేబుల్/ ట్రేడ్స్ మాన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండిలా.
◆ అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ITBP) అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలి.
◆ అధికారిక వెబ్సైట్ లింక్ :: https://www.itbpolice.nic.in/
◆ అధికారిక Home పేజీలోని Career లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఇప్పుడు మీరు Career Recruitment పేజీ లోకి రీ-డైరెక్ట్ అవుతారు.
◆ ఇక్కడ కనిపిస్తున్న recruitment.Itbpolice.nic.in లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఇప్పుడు మీరు ITBP RECRUITMENT WEBSITE వెబ్సైటుకు రీడైరెక్ట్ అయినారు.
◆ ఈ వెబ్సైట్ Main Menu లోని New User Registration లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి.
◆ తదుపరి యూజర్ ఐడి పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ అయి.. ఆన్లైన్ దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి.
◆ విజయవంతంగా సమర్పించిన దరఖాస్తు ఫామ్ ను భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకోని, భద్రపరుచుకోండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
నిరాకరణ : మేము eLearningBADI.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment