Hyd JOBs 2022 | హైదరాబాదులోని మేనేజ్ కన్సల్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
నిరుద్యోగులకు శుభవార్త!
హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్(MANAGE) డిగ్రీ అర్హతతో కన్సల్టెంట్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 29న నిర్వహిస్తున్నాం ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు, ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్లోనే విధులు నిర్వర్తించాల్సి ఉన్నట్లు నోటిఫికేషన్లో సూచించారు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం దరఖాస్తు విధానం మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి అగ్రికల్చర్ సైన్స్ విభాగంలో మాస్టర్ డిగ్రీ లేదా PGDM అర్హత తో రెండు సంవత్సరాల సంబంధిత విభాగంలో రాష్ట్రంలో లేదా కేంద్రంలో పని చేసిన అనుభవం ఉండాలి.







వయోపరిమితి:
ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 24 సంవత్సరాలు మించకూడదు.
Job Alert 2022 | కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్-బి (నాన్ గెజిటెడ్)ఉద్యోగాలు | పూర్తి వివరాలు..
ఎంపిక విధానం:
ఈ కన్సల్టెంటు ఉద్యోగాలకు ఎంపిక లు ఈ నెల 29న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటాయి.
◆ అభ్యర్థులు అకడమిక్ విద్యార్హతలకు అనుభవం ఆధారంగా తుది ఎంపిక చేపడతారు.
ITI JOBs 2022 | హైదరాబాద్ లోని ECIL 284 ఖాళీల భర్తీకి ప్రకటన.. | వీరు మాత్రమే అర్హులు..
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.42,000/- చెల్లిస్తారు.
అధికారిక వెబ్సైట్: https://www.manage.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఎంపికలకు ఇంటర్వ్యూలను నిర్వహించి తేదీ :: 29.08.2022 ఉదయం 10:30 గంటల నుండి
ఇంటర్వ్యూ వేదిక :: సెంటర్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ (CDA), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ (MANAGE) రాజేంద్రనగర్ హైదరాబాద్-500030, తెలంగాణ.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment