IRCTC Recruitment 2022 | 130 Hospitality Monitors Posts | AP, TS may apply online..
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ లిమిటెడ్ (IRCTC) సౌత్ సెంట్రల్ జోన్ నామినేటెడ్ మొబైల్/ స్టాటిక్ క్యాటరింగ్ యూనిట్లలో ఖాళీగా ఉన్న మొత్తం 130 హాస్పిటాలిటీ మానిటర్ పోస్టుల భర్తీకి, ఎలాంటి రాతపరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలు నిర్వహించే ఎంపికలు చేపట్టడానికి నేరుగా అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
సింగరేణి 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2(External) హాల్ టికెట్లు విడుదల..
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య : 130,
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 3 సంవత్సరాల బీఎస్సీ హాస్పిటాలిటీ & హోటల్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రొం సెంట్రల్/ స్టేట్/ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
★ 2021-22 విద్య సంవత్సరాల్లో బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయో-పరిమితి:
ఆగస్టు 1 2022 నాటికి 28 సంవత్సరాల మించకూడదు, రిజర్వేషన్ వర్గాలవారికి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
ఈ హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులకు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించే దరఖాస్తు ఫారమ్ను డౌన్లోడ్ చేసుకొని, వ్యక్తిగత అర్హత వివరాలతో పూర్తి చేసి నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
TS JOB FAIR 2022 | ఈనెల 28న 7000లకు పైగా ఉద్యోగాల భక్తికి ఇంటర్వ్యూలు.. రిజిస్టర్ అవ్వండిలా.
గౌరవ వేతనం:
ఎంపికైన వారికి ప్రతి నెల రూ.30,000/-జీతంగా చెల్లిస్తారు.
పని ప్రదేశం:
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిస్సా మరియు ఛత్తీస్ఘడ్.
ఇంటర్వ్యూ తేదీ :: 27.08.2022 & 28.08.2022.
ఇంటర్వ్యూ వేదిక:
ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, ఎఫ్-రో, విద్యానగర్, డీడీ కాలనీ, హైదరాబాద్, తెలంగాణ.







అధికారిక వెబ్సైట్ :: https://www.irctc.co.in/
అధికారిక నోటిఫికేషన్1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment