Bank of Maharashtra 314 Apprentices Recruitment 2022 | డిగ్రీ తో రాతపరీక్ష లేకుండా! 314 అప్రెంటిస్ ల భర్తీ | Check Salary and Application Process here..
డిగ్రీ తో రాతపరీక్ష లేకుండా! 314 అప్రెంటిస్ ల భర్తీ |
డిగ్రీ అర్హతతో ఎలాంటి రాతపరీక్ష లేకుండా! కేవలం మెరిట్ ప్రాతిపదికన 314 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా భారతీయ అభ్యర్థులు ఈ సీట్ల కోసం 13.12.2022 నుండి 23.12.2022 వరకు లేదా అంత కంటే ముందు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు, శిక్షణ కాలం ఒక సంవత్సరం ఉన్న ఈ కోర్సులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.9000/- జీతంగా అందించబడుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 314.
రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా ఖాళీల వివరాలు:
పూణే ప్రధాన కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2080 నెట్వర్క్ శాఖలను దేశవ్యాప్తంగా కలిగియున్నది, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి Apprentices Act 1961 ప్రకారం 14 రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. అవి;
1. ఆంధ్ర ప్రదేశ్ - 10,
2. చండీగర్ - 02,
3. చతిస్గడ్ - 02,
4. ఢిల్లీ - 10,
5. గోవా - 04,
6. గుజరాత్ - 06,
7. కర్ణాటక - 08,
8. మధ్యప్రదేశ్ - 22,
9. మహారాష్ట్ర - 207,
10. పంజాబ్ - 05,
11. రాజస్థాన్ - 03,
12. తమిళ్ నాడు - 10,
13. ఉత్తర ప్రదేశ్ - 20,
14. వెస్ట్ బెంగాల్ - 05.. మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..
✓ ఏదైనా బ్యాచిలర్ ఈ విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
✓ రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాల ఆధారంగా 10th, 12th తరగతుల్లో లోకల్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ చదివి ఉండాలి.
✓ స్థానిక భాష (చదవడం రాయడం మాట్లాడటం అర్థం చేసుకోవడం) వంటి నైపుణ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
✓ 31.03.2022 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 28 సంవత్సరాలకు మించకూడదు.
✓ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో 3 నుండి 15 సంవత్సరాల వరకు సడలింపు వర్తింపజేశారు.
✓ పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
✓ వచ్చిన దరఖాస్తులను విద్యార్హత/ స్థానిక భాషా పరిజ్ఞానం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపికను నిర్వహిస్తారు.
✓ ఇంజనీరింగ్ డిగ్రీ తర్వాత డిప్లమా పూర్తిచేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
✓ అభ్యర్థులు దరఖాస్తులో పేర్కొన్న వివరాల ఆధారంగా కంప్యూటరైజ్డ్ మెరిట్ లిస్ట్ తయారు చేయబడుతుంది.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు శిక్షణా కాలంలో ప్రతినెల రూ.9000/- జీతంగా చెల్లిస్తారు.
శిక్షణ కాలం: ఒక(1) సంవత్సరం.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు ఫీజు/ సంప్రదింపు చార్జీలు & జీఎస్టీ తో కలిపి..
✓ UR/ EWS/ OBC లకు రూ.150/-.
✓ SC/ ST లకు రూ.100/-.
✓ PwBD లకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
తాజా ఉద్యోగాలు!
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
✓ నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలమా భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
✓ అధికారిక వెబ్ సైట్ లింక్ :
✓ అధికారిక వెబ్ సైట్ లోనే Main Menu లో కనిపిస్తున్న Careers లింక్ పై క్లిక్ చేయండి.
✓ తదుపరి Current Openings పై క్లిక్ చేసి.. Know More లింక్ పై క్లిక్ చేయండి.
✓ ఇప్పుడు మీరు Current Openings పేజీ లోకి రీ డైరెక్ట్ అవుతారు.
✓ అప్రెంటిస్ నియామకాలు 2022-23 క్రింద కనిపిస్తున్న Registration Link పై క్లిక్ చేయండి.
✓ తదుపరి దరఖాస్తు ఫామ్ లో తెలిపిన వివరాల ఆధారంగా యొక్క వివరాలను నమోదు చేస్తూ విజయవంతంగా దరఖాస్తును సమర్పించండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 13.12.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 23.12.2022.
అధికారిక వెబ్సైట్ :: https://bankofmaharashtra.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment