AAI AERO OL ATC Recruitment 2022 | డిగ్రీ తో 364 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check eligibility and Apply online here..
![]() |
డిగ్రీ తో 364 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన |
గ్రాడ్యుయేట్లకు శుభవార్త!
న్యూఢిల్లీ సఫ్దర్జంగ్ లోని, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 364 అఫీషియల్ లాంగ్వేజ్ & ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ మహిళ, పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 22.12.2022 నుండి 21.01.2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఎంపికైన అభ్యర్థులకు రూ.60,000/- నుండి 1,80,000/- వరకు జీతంగా చెల్లించనుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.. ఇక్కడ.
ఖాళీల వివరాలు :
మొత్తం ఖాళీల సంఖ్య : 364.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
✓ మేనేజర్ (అఫీషియల్ లాంగ్వేజ్) - 02,
✓ జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) - 356,
✓ జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అఫీషియల్ లాంగ్వేజ్) - 04,
✓ సీనియర్ అసిస్టెంట్ (అఫీషియల్ లాంగ్వేజ్) - 02.. మొదలగునవి.
తప్పక చదవండి : SSC CHSLE 2022 Notification | 10+2 తో 4500 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం.
విద్యార్హత:
✓ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో B.Sc బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
(లేదా)
✓ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత.
(లేదా)
✓ సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
✓ 21.01.2023 నాటికి 32 సంవత్సరాలకు మించకూడదు.
✓ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 35 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
తాజా ఉద్యోగాలు!
ఎంపిక విధానం:
✓ ఆన్లైన్ రాత పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు ఉంటాయి.
✓ ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.36,000/- నుండి 1,80,000/- వరకు జీతం ప్రతి నెలా అన్ని అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
✓ జనరల్ అభ్యర్థులకు రూ.1,000/-
✓ AAI లో ఒక సంవత్సర కాల అప్రెంటిస్షిప్ విజయవంతంగా పూర్తిచేసిన SC/ ST /PWD/ మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 22.12.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 21.01.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.aai.aero/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
✓ అర్హత ఆసక్తి కలిగిన భారతీయ మహిళా, పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
✓ అధికారిక వెబ్ సైట్ లింక్ : https://www.aai.aero/
✓ అధికారిక Home పేజీలోని Career లింక్ పై క్లిక్ చేయండి.
✓ ఇప్పుడు మీరు అధికారిక Recruitment పేజీ లోకి పోయి డైరెక్ట్ అవుతారు.
✓ ఇక్కడ Recruitment for the Various Posts in Official Language and Air Traffic Control Under Advertisement No.08/2022 ఎదురుగా కనిపిస్తున్న Registration లింక్ పై క్లిక్ చేయండి.
✓ ఇప్పుడు మీరు దరఖాస్తులు సమర్పించడానికి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సూచనలతో కూడిన పేజీలో కిరే డైరెక్ట్ అవుతారు.. ముందుకు కొనసాగడానికి కింద కనిపిస్తున్న బాక్స్ పై (✓) చేసి Sign-up/ Start బటన్ పై క్లిక్ చేయండి.
✓ తదుపరి సంబంధిత, వివరాలను నమోదు చేస్తూ.. రిజిస్ట్రేషన్ విజయవంతం చేయండి.
✓ తదుపరి లాగినై దరఖాస్తులను సమర్పించండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment