Parakram Diwas 2021 | పరాక్రమ దివాస్ గా నేతాజీ జయంతిను ప్రకటించిన భారత ప్రభుత్వం. పూర్తి వివరాలు చదవండి.
'పరాక్రమ దివాస్' గా నేతాజీ జయంతిను ప్రకటించిన భారత ప్రభుత్వం. కొంతమంది పేరు వింటేనే ఒళ్ళు పులకరిస్తుంది. మరికొంత మంది పేర్లు వింటే శౌర్యంతో గుండె ఉప్పొంగుతుంది అలాంటి నేతలకు ప్రజలు హృదయాల్లో ప్రత్యక స్థానం ఉంటుంది. ఈ కోవకు చెందిన వారే నేతాజీ సుభాష్ చంద్రబోస్. దేశాన్ని బానిసత్వం నుంచి బయట పడేయడానికి బ్రిటిష్ వారితో సుదీర్ఘ సాయుధ పోరాటాన్ని నడపడానికి సిద్ధమని ప్రకటించి, ఆజాద్ హింద్ ఫౌజ్ ను నడిపించారు. నేతాజీ స్వతంత్ర భారతాన్ని చూడకుండానే అదృశ్యమయ్యారు, కానీ స్వతంత్రం తరువాత వచ్చిన భారత ప్రభుత్వాలు నేతాజీ ని సరిగ్గా పట్టించుకోలేదనే చెప్పాలి. అలాంటి జన నేతకు నరేంద్ర మోడీ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. నేతాజీ పుట్టిన రోజు జనవరి 23న జాతీయ పరాక్రమ దివాస్ గా సోమవారం (02.08.2021) ప్రకటించింది. ఈ విషయంపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అధికారిక ప్రకటన చేశారు. 2021 జనవరి 23న నేతాజీ 125వ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ కోల్కత్తా వెళ్లి నేతాజీ కి నివాళులు అర్పించారు. ఎల్జిన్ రోడ్ లో ఉన్న విక్టోరియా భవన్ కు నేతాజీ భవన్ గా నామకరణం చేసి, ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన పేరుతో ఒక ఎగ్జిబిష