TS TWREIS Non-Teaching Recruitment 2022 | Check Vacancies and Eligibility criteria here..
నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ, వరంగల్ ఎలాంటి రాత పరీక్షలు లేకుండా! జిల్లా పరివాహక ప్రాంతాల్లోనే వివిధ విద్యాలయ సంస్థల్లో ఖాళీగా ఉన్న బోధనేతర సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నేరుగా దరఖాస్తులను ఆహ్వానిస్తూ పేపర్ ప్రకటనను అక్టోబర్ 26, 2022న జారీ చేసింది. ఆసక్తి కలిగిన గిరిజన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రాంతీయ సమన్వయ అధికారి వరంగల్ మరియు కరీంనగర్ జిల్లా చైర్మన్ నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు. నోటిఫికేషన్లు పేర్కొన్న ఖాళీలకు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు/ బయోడేటా ఫామ్ అర్హత ధ్రువపత్రాల కాపీ తో అక్టోబర్ 28, 2022 నుండి నవంబర్ 07, 2022 సాయంత్రం 5:00 గంటలలోపు సమర్పించాలని పేపర్ ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు. తప్పక చదవండి :: NVS Hyderabad Region Recruitment 2022 | హైదరాబాద్ రీజియన్ నవోదయ విద్యాలయ సమితి రాతపరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 13, విభాగలవారీగా ఖాళీల వివరాలు: 1. స్టాఫ్ నర్స్ - 03, 2. జూనియర్ అసిస్టెంట్ - 01, 3. ల్యాబ్ టెక్నీషియన్ - 06, 4. అటెండర్ - 02, 5. ...