TSPSC Group -1 Prelims 2022 Final Result Out | గ్రూప్-1 ప్రిలిమ్స్-2022 తుది ఫలితాలు విడుదల | Download Rank Card here..
గ్రూప్-1 ప్రిలిమ్స్-2022 తుది ఫలితాలు విడుదల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రూప్-1 సర్వీసెస్ ఆఫీసర్ స్థాయి ఖాళీల భర్తీకి ఏప్రిల్ 26, 2022న మొత్తం 503 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్:04/2022, తేదీ: 26.04.2022ను జారీ చేసింది. తదుపరి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,019 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి, అక్టోబర్ 16, 2022 ఆదివారం నాడు గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష-2022 లను నిర్వహించింది. మొత్తం 503 పోస్టులకు 3,80,082 దరఖాస్తులు వచ్చాయి వీరిలో పరీక్షలకు 2,86,051 మంది అభ్యర్థులు హాజరైనట్లు టిఎస్పిఎస్సి ప్రకటించింది.. న్యాయపరమైన అడ్డంకులు రావడంతో సకాలంలో ఫలితాలను విడుదల చేయలేదు. ఫలితాల విడుదల పై హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేసి తాజాగా గ్రూప్-1, ఫిలిమ్స్ తుది ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 503 పోస్టులకు 25,150 మందిని ఎంపిక చేశారు. ఒక్కొక్క పోస్టుకు రూల్ ఆఫ్ రిజర్వేషన్లు ఆధారంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ ఎంపిక చేసినట్లు టిఎస్పిఎస్సి అధికారిక వెబ్సైట్లో ఫలితాలను అప్డేట్ చేసింది. అధికారిక వెబ్సైట్ :: https://www