నిరుద్యోగులకు శుభవార్త! భారతీయ రైల్వే ఉచిత శిక్షణతో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలను ఇక్కడ తనిఖీ చేయండి.
భారతీయ రైల్వే నిరుద్యోగ యువతకు శుభవార్త! భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ "రైల్ కౌశల్ యోజన" పేరుతో భారతీయ యువతకు ఉచిత శిక్షణ తో పాటు శిక్షణ అనంతరం, రైల్వేలో ఉద్యోగాలు, ఉద్యోగాల భర్తీలో ప్రాధాన్యం, కల్పిస్తూ నిరుద్యోగ యువతకు "స్కిల్ డెవలప్మెంట్" అందించడానికి ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ యొక్క సాధారణ సూచనలు: ● ఈ రైల్ కౌశల్ వికాస్ యోజన కోసం నోటిఫికేషన్ జారీ చేయబడినప్పుడు సమాచారం తెలుసుకున్న అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు. అదేవిధంగా ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా తమ సమాచారం అందించబడుతుంది. ● భారతీయ రైల్వేల మంత్రిత్వ శాఖ మరియు నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణ కార్యక్రమాలను నిరుద్యోగ యువతకు అందించడానికి ఇటువంటి నోటిఫికేషన్లను ప్రతి సంవత్సరం జారీ చేస్తూ ఉంటుంది. ● దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా సూచనలను క్షుణ్ణంగా చదవండి. ● తగు ఫార్మెట్లో అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించాలి. ● ఈ పథకం కింద ఎటువంటి రిజర్వేషన్లు వర్తించవు, అందరికీ సమ...