క్రీడా పాఠశాల ప్రవేశాలు 2023 బ్యాటరీ టెస్ట్ ద్వారా ఎంపిక | TW Model Sports School Admission 2023-24 | Check Details here..
విద్యార్థులకు శుభవార్త! 6వ, 7వ, 8వ, 9వ తరగతిలో మిగిలి ఉన్న షీట్ల భర్తీకి 2023-24 విద్యా సంవత్సరానికి ఆసక్తి కలిగిన అభ్యర్థులను బ్యాటరీ టెస్ట్కు ఆహ్వానిస్తూ ITDA భద్రాచలం పరిధిలోని కిన్నెరసాని గిరిజన సంక్షేమ మోడల్ క్రీడా పాఠశాల(అబ్బాయిలు) ఇంగ్లీష్ మీడియం నోటిఫికేషన్ జారీ చేసింది. గిరిజన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డిప్యూటీ డైరెక్టర్ శ్రీ డేవిడ్ రాజ్ ఐటీడీఏ భద్రాచలం ఒక ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఆసక్తి కలిగిన విద్యార్థుల కోసం ఇక్కడ.. ఖాళీల వివరాలు: 6వ తరగతిలో - 01, 7వ తరగతిలో - 01, 8వ తరగతిలో - 04, 9వ తరగతిలో - 09. మొత్తం - 15 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అర్హత ప్రమాణాలు: ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థులు అర్హులు. విద్యా సంవత్సరం 2022-23 లో 5వ, 6వ, 7వ, 8వ తరగతి పూర్తి చేసి ఉండాలి. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం. ఎంపిక విధానం: ఈ క్రీడా పాఠశాల ప్రవేశాలు Battery Test ద్వారా నిర్వహిస్తారు. బ్యాటరీ టెస్ట్ వేదిక, తేదీ, సమయం: వేదిక: Govt T.W M.S.S. కిన్నెరసాని, పాల్వంచ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తేదీ: 01.07.2023. సమయం: ఉదయం 9:00 గంటల నుండి. బ్యాటరీ టె...