TS EdCET - 2022 MQP with Key Out | తెలంగాణ EdCET మాస్టర్ ప్రశ్నాపత్రం తో .. 'కీ' విడుదల.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, డిగ్రీ విద్యార్హతతో.. ఉపాధ్యాయ వృత్తి విద్యా కోర్సుల ప్రవేశానికి TS EdCET-2022 ప్రవేశ పరీక్షను జూన్ 26న నిర్వహించింది.. ఈ వృత్తి విద్య ప్రవేశ పరీక్షలో అర్హత సాధించడం ద్వారా, 2 సంవత్సరాల బ్యాచిలర్ ఎడ్యుకేషన్ B.Ed కోర్సులో ప్రవేశం పొందవచ్చు.. ఈ కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు విధానం ఏప్రిల్ 7వ తేదీ నుంచి ప్రారంభమై, జూలై 15న ముగిసింది. జూలై 26న నిర్వహించిన TS EdCET - 2022 ఉమ్మడి ప్రవేశ పరీక్ష అనంతరం తాజాగా మాస్టర్ పరీక్ష పత్రంతో 'కీ' విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన ఈ కీ పై అభ్యంతరాలను సైతం జూలై 31వ తేదీ నుండి ఆగస్టు 1వ తేదీ వరకు స్వీకరించనుంది. TS EdCET - 2022 MQP with Key డౌన్లోడ్ చేయడం ఎలా?. TS EdCET - 2022 MQP with Key డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ◆ ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్సైటు సందర్శించాలి. ◆ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://edcet.tsche.ac.in/ ◆ తదుపరి హోం పేజీలోని అప్లికేషన్స్ విభాగంలో కనిపిస్తున్న సంబంధిత లింక్స్ పై క్లిక్ చేసి సమాచారాన్ని పొందవచ్చు.. ◆ మీ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేయడానికి,