తెలుగు సంవత్సరాల పేర్లు... వాటి అర్థాలు @eLearningBADI.in
తెలుగు సంవత్సరాల పేర్లు... వాటి అర్థాలు 1. ప్రభవ అంటే... ప్రభవించునది... అంటే... పుట్టుక. 2. విభవ - వైభవంగా ఉండేది. 3. శుక్ల ... అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక. 4. ప్రమోదూత .... ఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత. 5. ప్రజోత్పత్తి ... ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి. 6. అంగీరస ... అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థం. 7. శ్రీముఖ ... శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం. 8. భావ .... భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు. 9. యువ .... యువ అనేది బలానికి ప్రతీక. 10. ధాత ... అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు. 11. ఈశ్వర ... పరమేశ్వరుడు. 12. బహుధాన్య ... సుభిక్షంగా ఉండటం. 13. ప్రమాది ... ప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు. 14. విక్రమ ... విక్రమం కలిగిన వాడు. 15. వృష ... చర్మం. 16. చిత్రభాను