National health Mission Medical Staff Jobs 2022 | ఆ జిల్లా పల్లె దావఖానాల్లో మెడికల్ సిబ్బంది నియామకాలకు ప్రకటన | ఆన్లైన్ దరఖాస్తులకు రెండు రోజులే గడువు | పూర్తి వివరాలు మీకోసం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాల్లో వైద్య సిబ్బంది నియామకాలకు తరచూ కాంట్రాక్ట్ ప్రాతిపదికన నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా ఖమ్మం జిల్లా డి.ఎం.హెచ్.వో లో ఖాళీగా ఉన్న 71 మెడికల్ ఆఫీసర్ ల నియామకానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీనికి సంబంధించి అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానం, చివరి తేదీ, జీతభత్యాలు, మొదలగు సమాచారం మీకోసం. ఖమ్మం జిల్లా, వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం DMHO నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రామ్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పల్లె దవాఖానాల్లో ఈ క్రింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 29 వ తేదీ వరకు దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా సమర్పించుకోవాలి. పోస్టుల వివరాలు: పోస్ట్ పేరు: మెడికల్ ఆఫీసర్లు. మొత్తం పోస్టుల సంఖ్య: 71. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఎంబిబిఎస్ విద్యార్హతతో, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. వయసు: ఏప్రిల్ 1, 2022 నాటికి నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట వయస్సు కలి