CPRI Recruitment 2022| No Exam Required | BE BTech can apply online | check selection process here
సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బీఈ/ బీటెక్ అర్హతతో ఇంజనీరింగ్ ఆఫీసర్ గ్రేడ్-1 ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించే అభ్యర్థులకు సూచనలు: 1. భారతీయ అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు . 2. దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలగాలి. 3. అభ్యర్థులు పనిచేస్తున్న ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్లను కలిగి ఉండాలి. 4. దరఖాస్తులో భాగంగా ఫోటో, సిగ్నేచర్ లను అప్లోడ్ చేయాలి. 5. అలాగే సంబంధిత అర్హత ధ్రువపత్రాలను కూడా అప్లోడ్ చేయాలి. 6. అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులు తిరస్కరించబడతాయి . 7. దరఖాస్తు ఫీజు ₹.200 రూపాయలు. 8. ఎస్సీ/ ఎస్టీ/ మాజీ సైనికులు/ మహిళా అభ్యర్థులు/ CPRI డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు ఫీజు మినహాయించారు . 9. ఈ ఉద్యోగాలకు ఎంపిక లు సంబంధిత విద్యార్హత ధ్రువపత్రాల వెరిఫికేషన్, మరియు గేట్ స్క్వేర్(2020/ 2021) ఆధారంగా నిర్వహిస్తారు. 10. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా సంబంధిత సమాచారం