తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ SSC Inter AY 2022-23 ప్రత్యేక ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.
చదువుకోవాలనే ఆశ వుండి, చదువు మధ్యలో మానేసిన యువతకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, విద్యా సంవత్సరం 2022-23 కు గాను, SSC, Inter ప్రత్యేక ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ప్రత్యేక ప్రవేశాలు 12.09.2022 నుండి 24.09.2022 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా సెంటర్లలో నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఉన్నత అవకాశాలను అందుకోవాలని, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ పేజీలో అందించడం జరిగింది. Job Alert 2022 | డిప్లమా సివిల్ ఇంజనీరింగ్ అర్హతతో భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండిలా.. తెలంగాణ సార్వత్రిక విద్యా పీఠం, చదువు మధ్యలో మానేసిన వయోజనులకు గృహిణులకు మరియు ఎనిమిదవ తరగతి అర్హతతో ఉద్యోగం పొందిన వారికి గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. ఇక్కడ ప్రవేశం పొంది పదవ తరగతి ఇంటర్మీడియట్ చదువులను ఒక సంవత్సరం కాలంలో పూర్తి చేయవచ్చు. రెగ్యులర్ అకడమిక్ విద్యార్హతతో సమానంగా పరిగణించబడతాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, పదవ తరగతి ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ సొసైటీ సెంటర్ లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి తగు స