GST SA Music Teacher Job 2022 | ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొలువులకు ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది | పూర్తి వివరాలు.
నిరుద్యోగులకు శుభవార్త! ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్/ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో 214 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, సంగీత ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి పదో తరగతి, డిప్లోమా ఇంటర్మీడియట్ ,డిగ్రీ, డీఈడీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్ఏ పోస్టులకు ఏపీ టెట్ అర్హత తప్పనిసరి. స్కూల్ అసిస్టెంట్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీ ఆర్ టీ), ఆంధ్ర ప్రదేశ్ టెట్ వెయిటేజీ ఆధారంగా, మ్యూజిక్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్(టీ ఆర్ టీ), స్కిల్ టెస్ట్ ఆధారంగా, ఎస్ జీ టీ టెట్ కమ్ టి ఆర్ టి ఆధారంగా నియామకాలు జరుగుతాయి. ఆసక్తికర అభ్యర్థులు 01-07-2022 నాటికి 18 సంవత్సరాలు నిండి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తును చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.. AP Teac