TSPSC Departmental Test May-2022 Session Results Released | తెలంగాణ డిపార్ట్మెంటల్ పరీక్ష ఫలితాలు విడుదల..
తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో రిక్రూట్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు, మరియు ఇతర సంబంధిత అంశాలను.. వృత్తిలో భాగంగా పై పోస్టులకు అర్హత పొందడానికి.. సంవత్సరానికి రెండు సార్లు డిపార్ట్మెంట్ పరీక్షలను నిర్వహిస్తుంది. ఈ పరీక్షలను రాష్ట్రంలోని అన్ని ముఖ్య జిల్లా కేంద్రాల్లో కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ రూపంలో రాయవలసి ఉంటుంది. ప్రతి ఉద్యోగి ఈ పరీక్షలను.. అవసరాన్ని బట్టి తప్పనిసరిగా పాస్ కావలసి ఉంటుంది. అర్హత సాధించిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు సంబంధిత వివరాలను సర్వీస్ బుక్కులో నమోదు చేయించుకుని.. తదనుగుణంగా ప్రయోజనాలను పొందవచ్చు. తాజాగా మే-2022 సెషన్ డిపార్ట్మెంటల్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది . ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేయడానికి ముందు Response Sheet ను విడుదల చేయడానికి సంబంధించిన లింక్ ను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. May-2022 సెషన్ కు సంబంధించి పరీక్ష రాసిన అభ్యర్థులు సంబంధిత ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ రెస్పాన్స్ షీట్ లింక్ పై క్లిక్ చేసి, వ్యక్తిగత TDE రిఫరెన్స్ ఐడి, మొబ...