SBI PO JOBs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు 2000 Posts Apply Online here..
డిగ్రీ అర్హతతో బ్యాంక్ కొలువుల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీ శుభవార్త! ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ (CR & PO) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన, ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి పోటీ పడవచ్చు.. రాత పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన వారికి దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వహించడానికి పోస్టింగ్ ఇస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, దరఖాస్తు లింక్, ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు మొదలగునవి మీకోసం ఇక్కడ. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 2000 . పోస్ట్ పేరు :: ప్రొబేషనరీ ఆఫీసర్ . వర్గాల వారీగా ఖాళీల వివరాలు : SC - 300, ST - 150, OBC - 540, EWS - 200, GEN - 810, Total - 2000.. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. అభ్...