ఏఎన్ఎం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | ఇక్కడ దరఖాస్తు చేయండి | ANM Recruitment 2023 ✅ Check Details and Apply here..
SSC/ Inter అర్హతతో 18 నెలల ANM శిక్షణ పూర్తి చేసిన మహిళా అభ్యర్థులకు శుభవార్త! తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి యున్న 24 జిల్లాల ప్రీ-మెట్రిక్ పోస్ట్-మెట్రిక్ ఆశ్రమ పాఠశాల యందు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన 2023-24 విద్యా సంవత్సరానికి ANM పోస్టుల భర్తీకి ఆన్లైన్/ ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను గిరిజన సంక్షేమ శాఖ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన మహిళ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 623 . పోస్ట్ :: ANM (అవుట్సోర్సింగ్ బేసిస్). విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి SSC/Inter అర్హతతో 18 నెలల ANM శిక్షణ పూర్తి చేసి ఉండాలి. గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో ఇప్పటికే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వర్తించి ఉంటే 20% మార్కుల వరకు వెయిటేజ్ ఉంటుంది. (ప్రతి సంవత్సరానికి 5% వెయిటేజీ ఇవ్వబడుతుంది). వయోపరిమితి: దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలు కు మించకూడదు. ...