TSNGC Studemts online Competition || విద్యార్థులకు 'ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా' ఆన్‌లైన్‌లో పోటీలు
విద్యార్థులకు ' ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా' ఆన్‌లైన్‌లో పోటీలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, తెలంగాణ గ్రీన్‌కోర్ ఆధ్వర్యంలో రాష్ట్రం లోని 33 జిల్లాలకు చెందిన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విధ్యార్థులు, ఐదు నుంచి ఏడో తరగతి వరకు విద్యార్థులు జూనియర్ విభాగాల్లో, ఎనిమిది నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు సీనియర్ విభాగాల్లో నేరుగా నమోదు చేసుకొని, ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నటువంటి పోటీలో పాల్గొనాలని ఒక ప్రకటనలో తెలిపారు. ‘మన భూమి పునరుద్ధరణ’ అనే అంశంపై పోస్టర్ మేకింగ్, ‘వంట వనం’ (కిచెన్ గార్డెన్) అంశంపై ఫొటోగ్రఫీ, క్విజ్ పోటీలు ఉంటాయన్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన తెలంగాణ రాష్ట్రం లోని 33 జిల్లాలకు చెందిన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విధ్యార్థులు ఈ నెల 30లోగా ఆన్‌లైన్‌లో గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలన్నారు. TSNGC-WED-2021 జనరేషన్ పునరుద్ధరణ అనే థీమ్‌తో ప్రపంచ పర్యావరణ దినోత్సవం - 2021 సందర్భంగా తెలంగాణ స్టేట్ నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఆన...