TS Police Women Safety Wing Recruitment 2022 | తెలంగాణ జిల్లా బారోసా కేంద్రాల్లో మహిళలకు ఉద్యోగాలు.. వివరాలివే..
మహిళలకు శుభవార్త! తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ డ్రైవింగ్ వివిధ పోస్టుల భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.. తాజాగా మరొక జిల్లా నుండి 6 విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, జీతభత్యాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం. తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ కు చెందిన మహబూబాబాద్ భరోసా సెంటర్ ఒప్పంద ప్రాతిపదికన 6 విభాగాల్లో ఖాళీల భర్తీకి అర్హత, ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనను విడుదల చేసింది. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 6 విభాగాల వారీగా ఖాళీలు: ◆ స్టేట్ కోఆర్డినేటర్ కం సైకాలజిస్ట్ - 1, ◆ సపోర్ట్ పర్సన్ - 1, ◆ లీగల్ సపోర్ట్ ఆఫీసర్ - 1, ◆ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ANM - 1, ◆ డాటా ఎంట్రీ ఆపరేటర్ - 1, ◆ రిసెప్షనిస్ట్ - 1.. వయసు: పై అన్ని రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళ అభ్యర్థుల వయసు 20 నుండి 45 సంవత్సరాలకు మించకూడదు. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్ట్యూట్ నుండి సంబంధిత విభాగంలో అర్హత కలిగి, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు