SRTRI Recruitment 2021 || Swamy Ramananda Tirtha Rural Institute Free Training Employment Course.. || DDUGKY || Check eligibility here..
స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది!. నిరుద్యోగ యువతకు వివిధ ఉచిత శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ భోజన వసతితో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ ముందుకు సాగుతుంది. ప్రతి మూడు నుండి ఆరు నెలలకు ఒక్కొక్క నోటిఫికేషన్లను విడుదల చేస్తూ... నిరుద్యోగ యువతకు శిక్షణ అందిస్తూ ఉపాధి ఆధారిత శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ - తెలంగాణ ప్రభుత్వం వారి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ లో తెలంగాణ గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ - హాస్టల్ - భోజన వసతి తో పాటు ఉద్యోగ అవకాశాలను అందించడానికి, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDUGKY) భారత ప్రభుత్వం ద్వారా నియమింపబడ్డ ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ కార్యక్రమాలకు ఈ దరఖాస్తులను గ్రామీణ ప్రాంత అభ్యర్థుల నుండి స్వీకరించడానికి ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ క్రింది మూడు శిక్షణా కార్యక్రమాలను 3 నుండి 4 నెలల కాలపరిమితి తో అందిస్తుంది. 1. ఐటీ కంపెనీల హెచ్ఆర్ విభాగంల...