BSNL Recruitment 2021 | Apply 27 Posts of Technicians | Degree Diploma Candidates can apply Online |Check Eligibility criteria and Online apply here..
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ టెక్నీషియన్ అప్రెంటిస్ లో భర్తీకి ప్రకటన. BSNL (భారత్ సంచార్ నిగం లిమిటెడ్) ఇండియన్ బ్రాడ్ బ్యాండ్ వివిధ బిజినెస్ ఏరియాలలో ఖాళీగా ఉన్న 27 టెక్నీషియన్స్ లేదా డిప్లమా అప్రెంటిస్ ల కోసం అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 27, డిప్లమా అప్రెంటిస్ సెలక్షన్ (2021-22) బిజినెస్ ఏరియాల వారీగా ఖాళీల వివరాలు. 1. బోపాల్ - 5, 2. ఇండోర్ - 4, 3. గ్వాలియర్ - 3, 4. జబల్పూర్ - 3, 5. హోషంగాబాద్ - 3, 6. సాగర్ - 3, 7. సాత్నా - 3, 8. ఉజ్జయిని - 3.. ఇలా ఎంపీ టెలికాం సెక్టార్ లో ఖాళీగా ఉన్న మొత్తం 27 టెక్నీషియన్ ఖాళీల భర్తీకి బిఎస్ఎన్ఎల్ నియామకాలను చేపడుతుంది. అర్హత ప్రమాణాలు: ★ దరఖాస్తుదారులు తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి. ★ ఏ ఐ సి టి ఈ చే గుర్తించబడిన సంస్థ నుండి డిప్లమా కోర్సును పూర్తి చేసి ఉండాలి. ★ నవంబర్ 30 2021 నాటికి 25 సంవత్సరాలకు తగ్గకుండా వయస్సు ఉండాలి. ★ ఎఫ్టి /ఎస్సీ /పిడబ్ల్యుడి /ఓబిసి రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వం వయోపరిమితిలో సడలింపు లను అనుమతించింది.