Non-faculty Direct Recruitment 2023: 10+2, డిగ్రీ, B.Sc Nursing తో శాశ్వత పోస్టుల భర్తీకి భారీ నియామక ప్రకటన వెలువడింది.
ఆంధ్ర తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త! 10+2, డిగ్రీ, B.Sc Nursing తో శాశ్వత పోస్టుల భర్తీకి భారీ నియామక ప్రకటన వెలువడింది. ఆంధ్రప్రదేశ్ మంగళగిరి లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి శాశ్వత ప్రాతిపాదికన నియామకాలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను ఈ నెల 5వ తేదీ నుండి, వచ్చే నెల 5వ తేదీ సాయంత్రం 05:90 గంటల వరకు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, పోస్టుల వారీగా ఖాళీల సంఖ్య, ముఖ్య తేదీలు దిగువన.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 70 . విభాగాలవారీగా ఖాళీల వివరాలు: సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ (Gr-1) - 50, PA to ప్రిన్సిపల్ - 01, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 01, మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ (Gr-1) - 01, అసిస్టెంట్ (NS) - 01, పర్సనల అసిస్టెంట్ - 01, లైబ్రరీయన్ (Gr-3) - 01, ల్యాబ్ టెక్నీషియన్ - 02 అప్పర్ డివిజన్ క్లర్క్ - 02, ల్యాబ్ అటెండెంట్ (Gr-3) - 02.. మొదలగునవి. ద...