తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ TS GENCO AE 339, Chemist 60 Online Application..
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ జన్కో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాలను వినియోగించుకోండి. ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమైనాయి ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ఈనెల 29 తో ముగియనుంది. తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TS GENCO) రాష్ట్రంలోని కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల తో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తుంది. 339 అసిస్టెంట్ ఇంజనీర్ మరియు 60 కెమిస్ట్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన భర్తీ చేస్తుంది. మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సివిల్ & కెమిస్ట్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ముఖ్య తేదీలు, దరఖాస్తులు మొదలగునవి ఇక్కడ. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 399 . పోస్టుల వారీగా ఖాళీలు: అసిస్టెంట్ ఇంజనీర్ విభాగంలో - 339, కెమిస్ట్ విభాగంలో - 60. విభాగాల వారీగా ఖాళీలు : ఎలక్ట్రికల్ - 187, మెకానికల్ - 77, ఎలక్ట్రానిక్స్ - 25, సివిల్ - 50, కెమిస్ట్ - 60. Follow US for More ✨Latest Update'