తెలంగాణ అశోక్ నగర్ సైనిక్ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాలకు ప్రకటన | ఇక్కడ సీటు సాధిస్తే జీవితంలో స్థిరపడి నట్లే! | ప్రవేశ ప్రకటన పూర్తి వివరాలివే..
సైనిక పాఠశాల ప్రవేశాలకు ప్రకటన: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్, విద్యా సంవత్సరం (2022-23) కోసం, వరంగల్ జిల్లాలోని అశోక్ నగర్(బాలుర) గిరిజన సంక్షేమ సైనిక పాఠశాల, సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశాలకు ప్రస్తుత విద్యా (2021-22) సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని రకాల పాఠశాలల విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇక్కడ ప్రవేశం పొందిన వారికి, నాణ్యమైన ఉచిత విద్య తో భోజన వసతి, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్, రికార్డ్స్, నైట్ సూట్, ట్రాక్ సూట్, స్పోర్ట్స్ డ్రెస్.. మొదలగునవి అందిస్తూ సీబీఎస్ఈ సిలబస్తో విద్య బోధన నిర్వహించడం జరుగుతుంది. ◆ అర్హత ప్రమాణాలు: ● 2021-22 విద్యా సంవత్సరంలో 5వ తరగతి పూర్తి చేయాలి. ● ఐదవ తరగతి తెలుగు/ ఇంగ్లీష్ మీడియంలో చదివిన పరీక్ష మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ● 2021-22 ఆర్థిక సంవత్సరానికి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి 2,00,000/- మించకుండా అలాగే గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న వారికి 1,50,000/- మించకుండా ఉండాలి. ◆ సైనిక పాఠశాల ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్ధులు ప్రవేశం పొందే సమయ