Atomic Energy Central School-2 Hyderabad టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | జీతం ₹.26250 | పూర్తి వివరాలు మీకోసం..
హైదరాబాద్ లోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ 2022-23 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన ను తాజాగా విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల 26,250 రూపాయలు జీతం గా చెల్లించనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ◆ ఈ నోటిఫికేషన్ సంబంధించి పోస్టుల వివరాలు విద్యార్హత ఎంపిక విధానం దరఖాస్తు విధానం మరియు జీతభత్యాల వివరాలు మీకోసం.. ఖాళీల వివరాలు: ◆ ట్రైని గ్రాడ్యుయేట్ టీచర్-TGTs :: ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్, మ్యాథ్స్, ఫిజిక్స్, సోషల్ సైన్సెస్, ఆర్ట్.. సబ్జెక్టులలో ఖాళీగా ఉన్నాయి.. ◆ ప్రైమరీ టీచర్ PRTs :: లో కూడా ఖాళీలు ఉన్నాయి. వివరణాత్మక సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ లేదా వీడియో చూడండి. ★ విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీతో బీఈడీ అర్హత కలిగి ఉండాలి. ● AEES/ NVS/ KVS మరియు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసి రిటైర్ అయిన 65 సంవత్సరాల లోపు ఉపాధ్యాయులు కూడా దరఖాస్తులు చేయవచ్చు.. వయసు: ఏప్రిల్ 1 2022 నాటికి PRT లకు 40, TGT లకు 45 సంవత్సరాలకు మించకుడదు.