Online Tricks for High-speed Net | ఇంటర్నెట్ వేగాన్ని పెంచే మార్గాలివే..

ఇంటర్నెట్ వేగాన్ని పెంచే మార్గాలివే.. ఆధునిక సమాజంలో ఇంటర్నెట్ లేని మొబైల్, కంప్యూటర్, లాప్టాప్ లను ఊహించలేం. ప్రతి ఒక్కరు వారి రోజువారి సమయం మొత్తంలో 25% సమయాన్ని మొబైల్ ఫోన్ వాడడం, ప్రతి సమాచారం కోసం సోషల్ మాధ్యమాల ద్వారా అన్వేషించడం.. అలాగే ఇంటర్నెట్ వాడకం పెరిగిపోతుంది. ఇలా అందరూ ఒకే సమయంలో నెట్ వాడుతున్న కొద్దీ మొబైల్ ఫోన్, కంప్యూటర్, లాప్టాప్ గ్యాడ్జెట్ స్పీడ్ తగ్గుతుంది. ఇలా తగ్గడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి, అయితే అసలైన ప్రధాన కారణంగా.. బ్రౌజింగ్ హిస్టరీని పేర్కొనవచ్చు. మొబైల్ కంప్యూటర్లలో ఏదేని బ్రౌసర్ వాడడం వల్ల మనకు తెలియకుండానే బ్రౌజింగ్ హిస్టరీ పెరిగిపోతూ ఉంటుంది. హిస్టరీ కుకీస్ పెరుగుతూ పోయే కొద్దీ నెట్ వేగం తగ్గిపోతుంది.. ప్రతి ఒక్కరూ ప్రతి అవసరమైన విషయం కోసం గూగుల్ బ్రౌజర్ ద్వారా సమాచారం తెలుసుకోవడానికి అన్వేషణలు చేస్తుంటారు.. ఇలా ప్రతీ విషయం సమాచారం కోసం కుప్పలు-తెప్పలుగా డాటా పెరుగుతూ పోతుంది. ఇలా పేరుకుపోతున్న 'బ్రౌజింగ్ డాటాను' తొలగించుకోవడం కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారికి చిన్న విషయమే.. అయినప్పటికీ న్యూ యూజర్స్కు మాత్రం ఇది అద్భుతమైన చిట్కా అనిపించవచ్చు....