ఇంటర్ పాస్ లకు రూ.24,000/- స్కాలర్షిప్: Santoor Scholarship for Womens Apply here..
సంతూర్ స్కాలర్షిప్ పథకం 2023-24: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక & ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని యువతుల కోసం సంతూర్ స్కాలర్షిప్ ప్రోగ్రాం విప్రో కేర్ మరియు విప్రో కన్జ్యూమర్ కేర్ & లైటింగ్ గ్రూప్ 2023-24 విద్యా సంవత్సరానికి 12వ తరగతి పూర్తి చేసుకుని తదుపరి విద్యా అవకాశాల కోసం ప్రవేశం పొందిన యువతులకు సంవత్సరానికి రూ.24,000/- స్కాలర్షిప్ గా అందించడానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కార్యక్రమం 2016-17 నుండి ప్రారంభించబడింది. ఈ పథకం క్రింద అర్హులైన యువతులకు తమ డిగ్రీ కోర్స్ పూర్తి చేసుకోవడానికి సంవత్సరానికి రూ.24,000/- స్కాలర్షిప్ రూపంలో అందిస్తుంది. గడిచిన ఏడు సంవత్సరాలుగా ఈ స్కాలర్షిప్ పథకం కింద ఇప్పటికి దాదాపుగా 6,000 మంది యువతులకు విద్యకు ఈ స్కాలర్షిప్ తోడ్పాటు అయ్యింది. అర్హత ప్రమాణాలు/ విద్యార్హత : అభ్యర్థి ప్రభుత్వం పాఠశాల నందు పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే 12వ తరగతి కూడా ప్రభుత్వ పాఠశాల/ జూనియర్ కళాశాల నందు విద్యా సంవత్సరం 2022-23 లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. విద్యా సంవత్సరం 2023-24 కు గాను డిగ్రీ కోర్స్ పూర్తి చేసుకోవడానికి ప్రవేశం