Teacher JOB: టీజీటీ, పీజీటీ & పీఅర్టీ టీచర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్.. AWES TGT, PGT & PRT OST Recruitment SEP 2023 | Apply Online here.
%202023.jpg)
ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ, దేశవ్యాప్తంగా ఉన్న 136(APS) ఆర్మీ పబ్లిక్ పాఠశాలల్లో భారీగా టీచర్ ఉద్యోగాల భర్తీకి, ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్(OST)-SEP 2023 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. భవిష్యత్తులో ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ పాఠశాలల్లో రెగ్యులర్/ కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచర్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్(OST) ను తప్పనిసరి చేసింది . అభ్యర్థులు ఈ OST పరీక్షలో ప్రతిభ కనబరిచిన స్క్వేర్ కార్డ్ జీవితాంతం పనిచేస్తుందని అధికారికంగా తెలిపింది. భవిష్యత్తులో నిర్వహించే/ నిర్వహించబోయే నియామకాలకు వెయిటేజి లను కూడా ప్రకటించింది. రెగ్యులర్ ఉద్యోగాలకు 50% కాంట్రాక్ట్ ఉద్యోగాలకు 40% అర్హత సాధించాలని ప్రకటించింది. ఇప్పటికే అర్హత సాధించిన అభ్యర్థులు మరల దరఖాస్తు చేయనవసరం లేదని అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నది. పోస్టులు/ విభాగాలు/ సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు : పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(PGT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(TGT), ప్రైమరీ టీచర్(PRT) - (అన్ని సబ్జెక్టుల్లో).. విద్యార్హత: పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన...