క్రీడా కోటా ఉద్యోగాలు: భారత వాయుసేన శాశ్వత క్రీడా కోట ఉద్యోగాలు Indian Air Force Sports Quota Recruitment 2023..
క్రీడాకారులకు శుభవార్త! భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్, వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన, క్రీడాకారుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ.. క్రీడా కోటా ఉద్యోగాల నియామక ప్రకటనను జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత 11.09.2023 నుండి 20.09.2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. స్పోర్ట్స్ ట్రయల్స్ 03.10.2023 నుండి 05.10.2023 మధ్య నిర్వహిస్తున్నట్లు ముందస్తుగా అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, క్రీడా విభాగాలు, అధికారిక దరఖాస్తు లింక్ మీకోసం ఇక్కడ.. క్రీడా విభాగాలు: అతలిటిక్స్, ఆక్వాటిక్స్, బాస్కెట్బాల్, బాక్సింగ్, సైక్లింగ్, క్రికెట్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్, హాకీ, కబ్బడి, హ్యాండ్ బాల్, స్క్వాష్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, వాటర్ పోలో.. మొదలగునవి. అర్హత ప్రమాణాలు : వయోపరిమితి : 26.12.2022 నుండి 26.07.2026 మధ్య జన్మించి ఉండాలి. ఎంపికలు నిర్వహించే తేదీ నాటికి 21 సంవత్సరాలకు మించకూడదు. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి గణితం/ ఫిజికల్ సైన్స్/ ఇంగ్లీష్ సబ్జెక్టులతో కనీసం 50