ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ TS Junior College Guest Faculty Recruitment 2023 Apply here..

నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం Online Google Form ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు సబ్జెక్టుల వారీగా ఖాళీలతో మీ కోసం ఇక్కడ. ఖమ్మం జిల్లా పరిధిలోని మొత్తం 19 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యా సంవత్సరం 2023-24 కు గానూ వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకులను కొత్తగా నియమించడానికి కమిషనర్ ఇంటర్మీడియట్ విద్య, హైదరాబాద్ అనుమతి మేరకు ఖమ్మం జిల్లా డీ.ఈ.వో కే.రవిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 24.07.2023 సాయంత్రం 05:00 గంటల వరకు బయోడేటా ఫామ్ తో దిగువ పేర్కొన్న అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి, నోటిఫికేషన్ లో పేర్కొన్న చిరునామాకు అందించవలసిందిగా, అలాగే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 42 . పోస్టుల వారీగా ఖాళీల వివరాలు: జనరల్ విభాగం లో.. బోటనీ - 04, కెమిస్ట్రీ -...