ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ TS Junior College Guest Faculty Recruitment 2023 Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం Online Google Form ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు సబ్జెక్టుల వారీగా ఖాళీలతో మీ కోసం ఇక్కడ.
ఖమ్మం జిల్లా పరిధిలోని మొత్తం 19 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యా సంవత్సరం 2023-24 కు గానూ వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకులను కొత్తగా నియమించడానికి కమిషనర్ ఇంటర్మీడియట్ విద్య, హైదరాబాద్ అనుమతి మేరకు ఖమ్మం జిల్లా డీ.ఈ.వో కే.రవిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 24.07.2023 సాయంత్రం 05:00 గంటల వరకు బయోడేటా ఫామ్ తో దిగువ పేర్కొన్న అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి, నోటిఫికేషన్ లో పేర్కొన్న చిరునామాకు అందించవలసిందిగా, అలాగే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు.ఖాళీల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 42.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
- జనరల్ విభాగం లో..
- బోటనీ - 04,
- కెమిస్ట్రీ - 02,
- కామర్స్ - 04,
- ఇంగ్లీష్ - 04,
- హిందీ - 03,
- హిస్టరీ - 01,
- మ్యాథ్స్ - 05,
- ఫిజిక్స్ - 01,
- పొలిటికల్ సైన్స్ - 03,
- తెలుగు - 01,
- జువాలజీ - 08.
- వృత్తి విద్యా కోర్సుల్లో..
- ET - 01,
- GFC - 01,
- LM & DT - 01,
- MPHW (F) - 01,
- OA (Short Hand & Type Writing) - 01,
- Computer Science - 01.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతలను కలిగి ఉండాలి.
- ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ సిలబస్ ను బోధించడంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- స్క్రీనింగ్ టెస్ట్/ డెమో/ అకాడమిక్ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభ ఆధారంగా వెయిట్ ఏజ్ మార్పులను కేటాయిస్తూ షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితాను ప్రకటించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ నిబంధనల ప్రకారం ప్రతినెల వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులు Google Form ద్వారా ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులో భాగంగా ఈ దిగువ పేర్కొన్న సర్టిఫికెట్ల కాపీలను అప్లోడ్ చేయాలి. అవి;
- SSC, ఇంటర్మీడియట్, డిగ్రీ, పిజి మార్క్ మెమోలు,
- ప్రొవిజినల్ సర్టిఫికెట్లు,
- కుల ధ్రువీకరణ పత్రం,
- లోకల్ నేటివిటీ సర్టిఫికెట్
- 4 వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలు.. మొదలగునవి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
జిల్లాలోని జూనియర్ కళాశాలల వారీగా ఖాళీల వివరాలు:
ఇప్పుడే Google Form ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు.
అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి, పైన పేర్కొన్న ధ్రువపత్రాల కాపీలను బయోడేటా ఫామ్ తో జత చేసి, District Intermediate Education Office, IDOC, New Collector office, S-1 నందు 24.07.2023 సాయంత్రం 05:00 వరకు సమర్పించవచ్చు.
అధికారిక వెబ్సైట్ :: https://khammam.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్/ ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం తేదీ :: 20.07.2023 నుండి,
ఆన్లైన్/ ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 24.07.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment