Educational Updates || Career Guides || NEET longterm coaching || minority Free Jobs training and more @elearningbadi.in
1. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షల కు ఉచిత శిక్షణ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం: డిగ్రీ పూర్తి చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ యువతకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ ద్వారా ఐదు నెలలపాటు వివిధ ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి బి.నిర్మల, ఎస్సీ స్టడీ సర్కిల్ గౌరవ సంచాలకుడు ఆచార్య ఎం.ఎర్రగట్టుస్వామి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ. 3లక్షల వార్షిక ఆదాయం గల ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోపు వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన వారికి డిసెంబరు 5న సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఉదయం 11 నుంచి 1 గంటవరకు ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉత్తీర్ణులైన వారికి వడ్డెపల్లిలోని ఎస్సీ స్టడీ సర్కిల్ లో ఉచిత భోజన వసతితో కూడిన తరగతులు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు http://www.tsstudycircle.co.in/ వెబ్ సైట్లో చూడాలని వారు సూచించారు. 2. యువతకు కెరీర్ గైడెన్సపై అవగాహన: యువతలో నైపుణ్యాన్ని పెంచేందుకు జిల్లా