Educational Updates || Career Guides || NEET longterm coaching || minority Free Jobs training and more @elearningbadi.in
1. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షల కు ఉచిత శిక్షణ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం:
డిగ్రీ పూర్తి చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ యువతకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ ద్వారా ఐదు నెలలపాటు వివిధ ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి బి.నిర్మల, ఎస్సీ స్టడీ సర్కిల్ గౌరవ సంచాలకుడు ఆచార్య ఎం.ఎర్రగట్టుస్వామి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ. 3లక్షల వార్షిక ఆదాయం గల ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోపు వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన వారికి డిసెంబరు 5న సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఉదయం 11 నుంచి 1 గంటవరకు ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉత్తీర్ణులైన వారికి వడ్డెపల్లిలోని ఎస్సీ స్టడీ సర్కిల్ లో ఉచిత భోజన వసతితో కూడిన తరగతులు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు http://www.tsstudycircle.co.in/ వెబ్ సైట్లో చూడాలని వారు సూచించారు.
2. యువతకు కెరీర్ గైడెన్సపై అవగాహన:
యువతలో నైపుణ్యాన్ని పెంచేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఆర్డీవో శ్రీనివాస్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్, తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం, గెజిటెడ్ అధికారు ల సంఘం సౌజన్యంతో యువతకు సలహాలు, సూచ నలు ఇవ్వనున్నట్లు తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ నెల 22వ తేదీ వరకు కలెక్టరేట్లోని డీఆర్డీఏ కార్యాలయం లో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. 28న మధ్యాహ్నం హసన్‌పర్తిలోని సంస్కృతి విహాలో ని ర్వహించే కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. పూర్తి వివరాలకోసం 7032422111, 8801525396 నెంబర్లలో సంప్రదించాలన్నారు.
3. 'నీట్' లాంటర్మ్ కోచింగ్ దరఖాస్తు గడువు పొడిగింపు:
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో 2021-22 సంవత్సరానికి గాను ఎస్సీ బాల, బాలికలకు అందించే నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ దరఖాస్తు గడువును పొడిగించినట్లు ఎస్సీ గురుకులాల కార్యదర్శి రోనాల్డ్‌రోస్ శనివారం ఒక ప్రకనటలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 27 వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. మరిన్ని పూర్తి వివరాల కోసం https://www.tswreis.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవాలన్నారు.
4. మైనార్టీ స్టడీ సర్కిల్ లో ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న మైనార్టీ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్ (టీఎస్ఎంఎస్సీ) ఆధ్వర్యంలో రెండు నెలల ఫౌండేషన్ కోర్సు ఉచితంగా అందిస్తున్నట్లు టీఎస్ఎంఎస్సీ సంచాలకుడు షానవాజ్ ఖాసీం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 4వ తేదీలోగా జామియా నిజామియా కాంప్లెక్స్, మూడవ అంతస్తు, గన్ఫాండ్రీ, ఆబిడ్స్ లోని టీఎస్ఎంఎస్సీ కార్యాలయంలో దరఖాస్తును సమర్పించాలని, మరిన్ని వివరాలకు 040-23236112 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.
5. డిగ్రీ పసిన మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. రూ.71,500 జీతంతో తాజాగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు తప్పక దరఖాస్తు చేసుకోండి.
6. తెలంగాణ ప్రభుత్వం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వరంగల్ నుండి 275 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-II (సూపర్వైజర్), పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అంగన్వాడి టీచర్/ మినీ అంగన్వాడీ టీచర్/ అంగన్వాడి కోఆర్డినేటర్/ అంగన్వాడి ఇన్స్పెక్టర్స్/ కాంట్రాక్ట్ సూపర్వైజర్స్ నుండి పే-స్కేల్ (26,4 10/- నుండి78,820/-) కలిగిన పోస్టులకు రాత పరీక్షల ద్వారా ఎంపికలు,.. దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది... అర్హత ఆసక్తి కలిగిన మహిళలు తప్పక దరఖాస్తులు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.
7. మహబూబ్ నగర్ గిరిజన యువత కు శుభవార్త!
తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో నేషనల్ ఆకాకడమి ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఆద్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని గిరిజన యువతకు 3 నెలల ఉచిత వృతి విద్యా శిక్షిణ అందిస్తున్నట్లు న్యాక్ డైరెక్టర్ శివకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు..
ఈ శిక్షణాలకు గ్రామీణ యువత మాత్రమే అర్హులని పేర్కొన్నారు..
18-35 సంవత్సరాల వయసు ఉన్న అభ్యర్థులు క్రింద పేర్కొన్నటువంటి ఫోన్ నెంబర్ కు సంప్రదించాలని సూచించారు..
ల్యాండ్ సర్వే, ఎలక్ట్రీషియన్, ప్లాంబింగ్, మొదలగు కోర్సుల్లో శిక్షిణ ఉంటుందని మరిన్ని వివరాలకు 7989200412 నెంబర్ కు సంప్రదించాలని పేర్కొన్నారు..
Comments
Post a Comment