BHEL 660 ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ - ఐటిఐ పాస్ సర్టిఫికెట్ కలిగిన వారు మిస్ అవ్వకండి - Vacancies Notification - Apply
ఐటిఐ పాస్ సర్టిఫికెట్ కలిగిన వారు మిస్ అవ్వకండి. 660 ఉద్యోగాలు విడుదల: భారత ప్రభుత్వానికి చెందిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL), ఆర్టిషన్ గ్రేడ్ -4 విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advt. 01/2026 విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 660 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనిట్లలో పోస్టింగ్ ఉంటుంది, తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం యూనిట్ లో, అలాగే తెలంగాణలోని హైదరాబాద్ యూనిట్ లో పోస్టింగ్ ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ద్వారా ఎంపికలు నిర్వహిస్తారు. పూర్తి వివరాలు అధికారిక వెబ్సైట్ నందు అక్టోబర్ 19, 2026 న అందుబాటులోకి వస్తాయి. ఆన్లైన్ లో దరఖాస్తు సమర్పణ తేదీలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు రాత పరీక్ష కోసం సన్నద్ధం అవ్వండి. రాత పరీక్ష సిలబస్ కూడా నోటిఫికేషన్ ఆధారంగా ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను తరుచూ సందర్శిస్తూ ఉండండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్...










