TS TET 2022 Notification : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ TET నోటిఫికేషన్ యొక్క సమగ్ర సమాచారం, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానం, మరియు ఇతర సమాచారాన్ని ఇక్కడ తనిఖీ చేయండి.

టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!. దాదాపుగా 5సంవత్సరాల నుండి డి.ఎడ్, బి.ఎడ్ అభ్యర్థులు ఎదురు చూస్తున్న "టీచర్ అర్హత పరీక్ష" TET నోటిఫికేషన్ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ రేపటితో (26.03.2022)ప్రారంభం కానుంది. రాష్ట్ర ఆవిర్భావం తరువాత సెట్ నిర్వహించడం ఇది మూడవసారి, గతంలో 2016 మే మరియు 2017 జూలైలో అర్హత పరీక్షలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. 2015 డిసెంబర్ 23న టెట్ అర్హత పరీక్షకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నెంబర్ 36 లో ప్రధానంగా రెండు సవరణలు చేస్తూ ప్రభుత్వం తాజాగా జీవో నెంబర్ 8 ను 2022 లో విడుదల చేసింది. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(NCTE) మార్గదర్శకాల ప్రకారం ఈ మార్పులు చేశారు. అవి; 1. 6 నుండి 10 తరగతులకు బోధించేందుకు బీఈడీ చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు, దానికోసం టెట్ పేపర్-...