నిట్ వరంగల్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | NIT Warangal Visiting Faculty Recruitment 2023 Check eligibility and Apply here..

జాతీయ సంస్థల్లో టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT) వరంగల్ శుభవార్త! వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విజిటింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి వివిధ సబ్జెక్టుల్లో/ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను భర్తీ చేయడానికి, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను తేదీ:10.08.2023 న విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం సంబంధిత దరఖాస్తు ఫారంతో అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి ఈ నెల 20న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. ఖాళీల వివరాలు: విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.. పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్.. వ...